వరంగల్ ఎంపీ కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారదాలతో కలసి సోమవారం హనుమకొండ లో ఇందిరా మహిళా శక్తి మేళాను ప్రారంభించారు. సెర్ప్, మెప్మా ద్వారా 20 స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ స్టాల్స్ లో దాదాపు 40 రకాల వివిధ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందులో సెర్ప్ నుండి 28, మెప్మా నుండి 12 రకాల ఉత్పత్తులు ఉన్నాయి.