రేపు హన్మకొండ కలెక్టరేట్‌లో జాబ్ మేళా

77చూసినవారు
రేపు హన్మకొండ కలెక్టరేట్‌లో జాబ్ మేళా
హన్మకొండ కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హన్మకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీలో పని చేసేందుకు ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 78933 94393 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్