హనుమకొండ సుబేదారి పరిధిలో జరిగిన హత్య కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు గురువారం హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. మడికొండకు చెందిన నిందితుడు ఏనుగు వెంకటేశ్వర్లు, మాచర్ల రాజుకుమార్, ఆటోలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మడికొండకు చెందిన ఓ మహిళతో ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంకటేశ్వర్లు. రాజుకుమార్ ను ఎలాగైనా చంపాలని పథకం పన్ని హత్యచేసాడన్నారు.