గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కమిషనర్ అశ్విని తానాజీ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల వింగ్ అధికారులు గత గ్రీవెన్స్ పెండింగ్, పరిష్కార వివరాలతో హాజరుకావాలన్నారు.