రేపు నీటి సరఫరా బంద్

85చూసినవారు
రేపు నీటి సరఫరా బంద్
వరంగల్ బల్దియా పరిధి హన్మకొండ పరిధి వికాస్ నగర్ భవానినగర్ జంక్షన్ ప్రాంతంలో 500 డి ఐ పైప్ లైన్ కు లీకేజీ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నందున ఆదివారం నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని బల్దియా ఈ ఈ రాజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇట్టి పరిధిలోని ప్రాంతాలైన శ్రీనివాస కాలనీ అడ్వకేట్స్ కాలనీ బాల సముద్రం ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అట్టి ప్రాంత వాసులు గమనించి సహకరించాలని ఈ ఈ కోరారు.

సంబంధిత పోస్ట్