కాజీపేట మండలం గురువారం రోజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని నాగేందర్ రెడ్డి కి తెలంగాణ కళాకారులు ఎమ్మెల్యే నివాసంలో వినతి పత్రం సమర్పించారు.
సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ 2024 రోజున కాళోజి కళాక్షేత్రం మరియు మినీ రవీంద్ర భారతిని ప్రారంభం చేయుటకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వస్తున్న సందర్భంగా తమ సమస్యలను చెప్పడానికి అవకాశం కల్పించాలని కళాకారులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు.