వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలో శుక్రవారం నల్లబెల్లి గ్రామ పర్యటన ముగించుకొని ఇల్లంద గ్రామానికి వెళ్తుంటే దారి మధ్యలో పోలం లో నాటు వేసే బంజారా మహిళలను ఆప్యాయంగా పలకరించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. వారితో కలిసి నాటు వేశారు. వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తోడుంటుందని హామీ ఇచ్చారు.