భార్యభర్తల విధులు, ఇంట్లో పనుల గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య సమయానికి వంట చేయకపోవడం, భర్తని ఇంటి పనులు చేయమనడం, బట్టలు ఉతకమనడం ఆత్మహత్యకు ప్రేరేపిత కారణాలు కావని, ఈ సమస్యలు సామాన్యమైనవని, అందరి ఇళ్లలో సాధారణమని కోర్టు వ్యాఖ్యానించింది. భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ ఆరోపణలను "చిన్నవి" అని కోర్టు పేర్కొంది.