చేతి పంపులను కొట్టకుండానే వస్తున్న నీరు (షాకింగ్ వీడియో)

79చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామంలోని నాలుగు చేతి పంపుల్లో కొట్టకుండానే ధారాళంగా నీళ్లు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు అధికంగా పెరగడంతో చేతిపుంపులను కొట్టకుండానే నీళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు షాక్‌కు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్