వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్‌

80చూసినవారు
వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్‌
కేరళలోని వయనాడ్‌ కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తగా ప్రకటించాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని కోరారు. నష్టపరిహారాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ లో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. అందరూ ఐక్యంగా సాయం అందించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన రోడ్లు తెగిపోయాయి. బాధితులకు సాయం అందించేందుకు వయనాడ్‌కు సమగ్ర పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్