హిండెన్‌బర్గ్‌ను మూసివేస్తున్నాం: నాథన్‌ అండర్సన్‌

55చూసినవారు
హిండెన్‌బర్గ్‌ను మూసివేస్తున్నాం: నాథన్‌ అండర్సన్‌
అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ను మూసివేయనున్నట్లు వ్యవస్థాపకుడు నాథన్‌ అండర్సన్‌ ప్రకటించారు. ఈ సంస్థను 2017లో స్థాపించారు. 'సంస్థ వ్యవహారాల్లో నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. జీవితానికి సరిపడా సాహసాలు చేశాను. హిండెన్‌బర్గ్‌ మూసివేత వెనక ఎటువంటి భయాలు, వ్యక్తిగత విషయాలు, అనారోగ్య కారణాలు లేవు' అని పేర్కొన్నారు. కాగా గతేడాది అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్