విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. 'ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేశ్' అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా తెగ నచ్చేయడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. కాగా ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.