బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి వెళ్లడానికి దారి తీసిన పరిస్థితుల్లో అమెరికా ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ఖండించారు. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. తమపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.