పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు మాకు తెలియదు: ఎస్పీ

63చూసినవారు
పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు మాకు తెలియదు: ఎస్పీ
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పై తమకు సమాచారం లేదని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఆయన కోసం గాలిస్తున్నామని, అదుపులోకి తీసుకున్నట్లు తమకే తెలియదన్నారు. కాగా పిన్నెల్లిని సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.