తెలంగాణలో మెగా డీఎస్సీ ద్వారా 11వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదని.. తాము 37వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. 'ఖమ్మం జిల్లానే ప్రభుత్వానికి ఆయు పట్టు. ఇంకా కొంతమంది పింక్ కలర్ మైకంలోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే సెంచరీ కొడతారంట. గత పార్లమెంట్ ఎన్నికల్లో డక్ ఔట్ అయ్యారు' అని ఎద్దేవా చేశారు.