రాష్ట్రంలో పరిశ్రమలు రావడం బీఆర్ఎస్కు ఇష్టం లేదా? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘‘పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూమి కోల్పోతున్న రైతుల బాధ మాకు తెలుసు. వారికి మంచి ప్యాకేజీ ఇస్తున్నాం. ఇవేమీ ఆలోచించకుండా కావాలనే కుట్రపూరితంగా లగచర్లలో కలెక్టర్‌పై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి’’ అని అన్నారు.