AP: తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ నేపథ్యంలో అధికారులు ఊహించని రీతిలో భక్తులు వచ్చారు. అయితే టోకెన్ల కోసం బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో భక్తులను అధికారులు ఉంచారు. టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించేందుకు క్యూలైన్ తెరిచారు. టోకెన్ల జారీ చేసేందుకు క్యూలైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.