మీ పేరుపై 9 సిమ్ కార్డులు (ప్రత్యేక ప్రాంతాల్లో 6) కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే మీరు భారీగా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. లిమిట్‌కు మించి సిమ్ కార్డులు తీసుకున్నట్లు మొదటి సారి తేలితే రూ. 50 వేల వరకు ఫైన్ పడుతుంది. అయితే, అదే తప్పును మళ్లీ చేసినట్లయితే అప్పుడు రూ.2 లక్షల వరకు పెనాల్టీ పెరుగుతుంది. కొన్నిసార్లు జైలుకు సైతం వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా అయితే లిమిట్ దాటితే ఫైన్ విధించాలని ఎలాంటి నిబంధనలు లేవని నిపుణులు చెబుతున్నారు.