పౌరులు తమ పేరిట ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయనే విషయాన్ని తేలికగా తెలుసుకోవచ్చు. అదనంగా ఉన్నట్లు గుర్తిస్తే ఫిర్యాదు చేసి వాటిని బ్లాక్ చేసేందుకు వీలు కల్పిస్తోంది డీవోటీ. tafcop.sancharsaathi.gov.in/telecomUser/ సందర్శించి ఫోన్‌నంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ అయి ఎన్ని సిమ్‌కార్డులున్నాయనేది గుర్తించవచ్చు. దుర్వినియోగం అవుతున్నట్టు గుర్తిస్తే అక్కడే బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.