దేశంలో వచ్చే మూడు నెలల్లో వందేభారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణన్ ఆదివారం ప్రకటించారు. బెంగళూరులో రైలు కోచ్‌లను పరిశీలించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. 'ఈ రైలు మధ్య తరగతి ప్రజలకు రవాణా సాధనం. అందువల్ల ఛార్జీలు అందుబాటులోనే ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఛార్జీలు ఉంటాయి." అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.