ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల కోసం శీతాకాలంలో చేపలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి బలోపేతం కోసం ఆకు కూరలు, జీర్ణాశయ ఆరోగ్యానికి పులియబెట్టిన ఆహారం, ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఎనర్జీ కోసం దుంపలను, మెగ్నీషియం కోసం నట్స్, సీడ్స్ని, ఒత్తిడిని తగ్గించడానికి హెర్బల్ టీని తీసుకోవాలని సూచిస్తున్నారు.