ఫ్లోరైడ్‌కు రుచి ఉండదు. ఫ్లోరిన్.. దంతాలు, ఎముకల నిర్మాణానికి ఉపకరిస్తుంది. లీటర్ నీటిలో 1 మిల్లీ గ్రాము ఫ్లోరిన్ ఉండొచ్చు. అంతకుమించితే అనారోగ్యకరం. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీటిని ట్యాంకుల్లో నింపితే కొంతసేపటికి అడుగున తెల్లని సన్నని మడ్డి పేరుకుంటుంది. ఇదే ఫ్లోరైడ్. ఫ్లోరిన్ నీళ్లు అధికంగా తాగితే రక్తనాళాలు మూసుకుపోతాయి. గుండెరోగాలు, ఎముకల వ్యాధులు వస్తాయి. కాళ్లు, చేతుల వేళ్లు వంకరగా మారుతాయి. దీనినే ఫ్లోరోసిస్ అంటారు.