కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో మధ్య స్థాయి, సీనియర్ స్థాయి పదవులను సాధారణంగా సివిల్ సర్వీసు అధికారులతో భర్తీ చేస్తుంది. కానీ వారితో సంబంధం లేకుండా బయటి వ్యక్తులు, నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడాన్నే ‘లేటరల్ ఎంట్రీ’ అంటారు. మూడు లేదా ఐదేళ్ల ఒప్పందంతో వారిని నియమిస్తారు. అయితే దీని ద్వారా రాజకీయ పరపతి ఉన్నవారికే పదవులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.