AP: తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గత ఎన్నికల్లో 30 వార్డులను YCP గెలుచుకుంది. ఒకరు మృతి చెందగా, మరొకరు రాజీనామా చేశారు. ఇటీవల 10 మంది కౌన్సిలర్లు TDPలో చేరారు. మరో నలుగురి కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందంటూ YCP కౌన్సిలర్లను క్యాంప్‌కు తరలించి చలో తునికి పిలుపునిచ్చింది. పోటీగా TDP కార్యకర్తలు అక్కడికి భారీగా వచ్చారు.