ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప-2' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. దీంతో ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 829 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. దీంతో అత్యంత వేగంగా రూ.800 కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందని పేర్కొంది. కాగా ఇవాల్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లను కాస్త తగ్గించారు.