తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయంలోని మహా శివలింగం వేములవాడకు చెందిందనడానికి ఆధారాలున్నాయి. ఈ దేవాలయాన్ని నిర్మించిన చోళరాజైన రాజరాజు, కరీంనగర్‌లోని వేములవాడ నుంచి బృహత్ శివలింగాన్ని తంజావూరు తరలించి బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠింపజేశారు. తెలంగాణ ప్రజలు దీనికి బాధపడినా, పార్వతీ అమ్మవారిని ఊరడించే ప్రయత్నంలో పూలతో మేరుపర్వతంలా పేర్చి, దానిపై పసుపుతో గౌరీదేవిని రూపొందించి, దసరా సందర్భంలో ఆటపాటలతో తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నారని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం.