చలికాలంలో రాత్రి వేళ మంచు అధికంగా కురుస్తుంది. పత్తి సాగు చేసిన రైతులు మంచు తీవ్రత కారణంగా నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. దీనిని అధిగమించడానికి రైతులు వేకువజామునే పత్తి తీయడం ఆపాలి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు సూర్యరశ్మి అధికంగా ఉండే సమయంలో తీయడం ద్వారా పత్తి నాణ్యతను కాపాడుకోవచ్చు.