ఆప్ కీలక నేత రాఘవ్ చడ్డా ఎక్కడ?

69చూసినవారు
ఆప్ కీలక నేత రాఘవ్ చడ్డా ఎక్కడ?
ఆప్ కీలక నేత రాఘవ్ చడ్డా ఎక్కడా అని ఇండియా కూటమిలోని ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన నేత జితేంద్ర అవ్హద్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అయితే, ఈ పోస్టు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే దాన్ని తొలగించడం గమనార్హం. రాఘవ్ చడ్డా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే మార్చి తొలి వారంలో ఆయన కంటి వైద్యం నిమిత్తం లండన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. భారత్ కు ఎప్పుడు వస్తారో స్పష్ట లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్