చంద్రబాబు, పవన్‌పై సోషల్ మీడియాలో పోస్టుల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆయనను విచారించేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ వచ్చారు. ఆర్జీవీ ఇంట్లో లేరని సిబ్బంది పోలీసులను అడ్డుకున్నారు. దాంతో చాలా సేపు హైడ్రామా నడిచింది. ఆర్జీవీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ లేదా కోయంబత్తూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.