శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే చాలా అవయవాల పనితీరు దెబ్బతింటుంది. రక్తంలో చక్కెర స్థాయుల్లో నిత్యం హెచ్చుతగ్గులు జరుగుతుండటం గుండెకు ఏమాత్రం మంచిది కాదు. శరీరం కదలకపోతే కండరాలలో ఉన్న షుగర్ కాలేయానికి కూడా చేరుతుంది. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే రెటీనాలోని పలుచని రక్తనాళాల్లో వాపునకు కారణమవుతుంది. ఫలితంగా కళ్లకు సమస్య వస్తుంది. కిడ్నీలు వాటి పని సరిగ్గా చేయలేవు. గాయాలైతే అంత వేగంగా మానవు