మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై శివసేన యూబీటీ నేత ఉద్దవ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించుకుందామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్సీ) తమ అభ్యర్థుల పేర్లను తెలియజేయాలని సూచించారు. మహారాష్ట్ర అభ్యున్నతి కోసం అంతా కలిసి పని చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే మరోసారి స్పష్టం చేశారు.