కులగణనకు, రేషన్ కార్డులకు ఎందుకు ముడిపెట్టారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. "ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను చెత్తబుట్టలో పడేశారు. రేషన్‌కార్డుల కోసం లక్షల మంది ఆన్‌లైన్, మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వాటిని కూడా పట్టించుకోవట్లేదు. కులగణన సర్వే ప్రకారమే రేషన్‌కార్డులు ఇస్తున్నారు. కులగణనకు, రేషన్ కార్డులకు ఎందుకు ముడిపెట్టారు?" అని హరీష్ నిలదీశారు.