భారత వికెట్ కీపర్, బ్యాటర్ వృద్ధిమాన్ సాహా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీయే కెరియర్లో చివరిదని వెల్లడించారు. ఆఖరిసారిగా తన సొంత జట్టు బెంగాల్ తరఫున ఆడుతున్నట్లుగా ప్రకటించారు. రిటైర్ అయ్యే ముందు రంజీ ట్రోఫీలో చివరిగా బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. తన కెరియర్లో భాగమైన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.