రాకాసి అలలతో.. తీరప్రాంతాల మూసివేత

50చూసినవారు
రాకాసి అలలతో.. తీరప్రాంతాల మూసివేత
కాలిఫోర్నియాలో 3 రోజులుగా తీర ప్రాంతాల్లోని నివాసాలపై రాకాసి అలలు ఎగసిపడుతుండడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. 20నుంచి 40 అడుగుల ఎత్తులో అలలు విరుచుకుపడుతుండడంతో స్థానికుల నివాసాలను ఖాళీ చేస్తున్నారు. వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటిమరీ అలలు ఎగసిపడుతున్నాయి. గురువారం నుంచి చాలాచోట్ల పరిస్థితి ఇలానే ఉందని అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావం కారణంగానే ఎగసిపడుతున్నట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్