'సిగరెట్ తాగే అమ్మాయిల సంఖ్య రెట్టింపు'

67చూసినవారు
'సిగరెట్ తాగే అమ్మాయిల సంఖ్య రెట్టింపు'
'భారతదేశంలో పొగాకు నియంత్రణ 2022' పేరుతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా పొగాకు వాడుతున్న యువత సంఖ్య పెరిగిందని పేర్కొంది. యువతులలోనూ సిగరెట్లు, బీడీలు తాగే అలవాటు శరవేగంగా పెరిగిపోతోందని అంటున్నారు. 2009లో దేశంలో 2.4% మంది బాలికలు పొగతాగుతుండగా, 2019లో అది 6.2%కి పెరిగిందని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్