వైద్యుల నిర్లక్ష్యం.. బాగున్న కిడ్నీని తొలగించారు!

64చూసినవారు
వైద్యుల నిర్లక్ష్యం.. బాగున్న కిడ్నీని తొలగించారు!
రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రి బృందం శస్త్రచికిత్స చేసింది. అయితే.. సర్జరీ సమయంలో పాడైపోయిన కిడ్నీకి బదులుగా ఆరోగ్యవంతమైన కిడ్నీని తొలగించి సర్జరీ పూర్తి చేశారు. కొద్దిరోజుల తర్వాత ఆ మహిళ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరో ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్