ముంబైలోని వసాయ్ రోడ్ స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. చిన్న పాపతో ఉన్న మహిళతో ఓ వ్యక్తికి వాగ్వాదం జరిగింది. దీంతో ఆ వ్యక్తి కోపంతో బాధిత మహిళపై దాడి చేశాడు. జుట్టు పట్టుకుని లాగి ఆమెను కొట్టాడు. కాసేపటికి కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. మహిళపై దాడిని చేస్తున్న వ్యక్తిని అడ్డుకున్నారు. అతడిని చితక్కొట్టి బుద్ధి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.