రోలర్ కోస్టర్ పై నుంచి పడి మహిళ మృతి

75చూసినవారు
రోలర్ కోస్టర్ పై నుంచి పడి మహిళ మృతి
రోలర్ కాస్టర్ పై నుంచి కింద పడి మహిళ మృతి చెందిన ఘటన ఢిల్లీలో జరిగింది. చాణక్యపురికి చెందిన ప్రియాంక తనకు కాబోయే భర్తతో కలిసి ఢిల్లీ శివారులోని ఫన్‌ఎన్‌ఫుడ్ వాటర్ పార్క్‌కు వెళ్లింది. రోలర్ కాస్టర్ పైకి వెళ్లగానే ప్రియాంక కూర్చొన్న చోట పట్టుకునే రాడ్‌ విరిగిపోయింది. దీంతో ఆమె‌ కిందపడింది. తీవ్రంగా గాయపడగా వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

ట్యాగ్స్ :