ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ ఫ్యామిలీ కోర్టులో ఇద్దరు మహిళా లాయర్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకరినొకరు బూతులు తిడుతూ విచక్షణ రహింతంగా తన్నుకున్నారు. కిందపడేసి గోళ్లతో ముఖాలు గీసుకున్నారు. పక్కనున్న వారు ఎన్నిసార్లు ఆపినా ఆగకుండా ఒకరిమీద ఒకరు పడి గాయపరుచుకున్నారు. ఈ వీడియో పాతది అయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బుద్ధి చెప్పాల్సిన వారే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ జనం తిట్టిపోస్తున్నారు.