మహిళను కారు బానెట్‌కు కట్టి ఈడ్చుకెళ్లారు (వీడియో)

7623చూసినవారు
పోలీసులు ఓ మహిళను కారు బానెట్‌కు కట్టి 500 మీటర్లు లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్ జిల్లా గోటెగావ్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న సోను కహర్‌ను అదుపులో తీసుకున్నారు. సోనుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుండగా.. తల్లి మోహిని కహర్ అడ్డుకుంది. దాంతో పోలీసులు వాహనం బానెట్‌ను కట్టి లాక్కేళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఎస్సీ నర్సింగ్‌పూర్ పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్