మేడ్చల్ మాల్కాజ్‌గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి కండ్లకోయలోని CMR కాలేజీ హస్టల్లో వీడియోల చిత్రీకరణ విషయాన్ని తెలంగాణ మహిళ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై నేడు మహిళ కమిషన్ ముందు CMR కాలేజీ ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి, ప్రతినిధులు హాజరై వివరణ ఇచ్చారు. హాస్టల్ వాష్ రూమ్స్‌లో వీడియోలు చిత్రీకరణ ఆరోపణలు వస్తుంటే మీరేం చేస్తున్నారని కమిషన్ ప్రశ్నించింది. ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషన్ అడిగింది.