ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం రాజన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకోగానే మంత్రులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.