తమిళనాడులోని తంజావూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మల్లిపట్నం ప్రాంతంలో పాఠశాల తరగతి గదిలో బోధిస్తున్న ఉపాధ్యాయురాలిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు రమణి(26) తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో పన్నీర్‌సెల్వం అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పాఠశాల విద్యార్థుల ముందే తరగతి గదిలో ఈ హత్య జరగడం సంచలనం రేపింది.