కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగాట్‌, బజరంగ్ పునియా

59చూసినవారు
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగాట్‌, బజరంగ్ పునియా
భారత రెజ్లర్లు వినేశ్ ఫొగాట్‌, బజరంగ్ పునియా బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వచ్చే నెలలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. వినేశ్ ఫొగాట్‌కు జులనా నియోజకవర్గ సీటు, బజరంగ్ పునియాకు బద్లీ అసెంబ్లీ స్థానం కేటాయించారు. ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం వీరిద్దరు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. ఫొగాట్, పునియా చేరిక కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారే అవకాశముంది.

ట్యాగ్స్ :