రేపటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

85చూసినవారు
రేపటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 11 రోజుల పాటు జరగనున్నాయి. రేపు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 17న ఎదుర్కోలు, 18న తిరుకళ్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం సేవలను రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్