యాదాద్రి ఆలయంలో శుక్రవారం పులిహోర ప్రసాదంలో ఎలుక రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ విషయం తెలిసిన బీజేపీ కార్యకార్తలు శనివారం యాదగిరిగుట్టపై ఉన్న ఈఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భక్తులకు ప్రసాదాల తయారు చేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ అందరికీ ఉచిత అన్న ప్రసాదం కల్పించాలని డిమాండ్ చేశారు.