భువనగిరి: సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

75చూసినవారు
భువనగిరి: సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే
భువనగిరి కలెక్టర్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కప్ టార్చ్ ర్యాలీని గురువారం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుండి భువనగిరి కోట వరకు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద కాగడ వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పల్లెల నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీయడానికి సీఎం కప్ చక్కటి వేదిక అన్నారు.

సంబంధిత పోస్ట్