యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణం జాగృతి డిగ్రీ కళాశాల ఎదుట ఎన్ఎస్. యూఐ, యువజన కాంగ్రెస్ నాయకులు గురువారం ఆందోళన నిర్వహించారు. స్వార్ధ రాజకీయాలతో బి. ఆర్. ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో కుమ్మక్కై విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ దశలవారీగా విడుదల చూస్తుందని, కమిటీ ఏర్పాటును గుర్తు చేశారు.