యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ సిబ్బందికి, ఆశ వర్కర్స్, అంగన్వాడీ కార్యకర్తలకు డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. లాక్ డౌన్ సమయంలో వీరు చేస్తున్న సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వేములకొండ ఎంపీటీసీ సామ రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ కొత్త నర్సింహ, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లోడంగి రవి, మాజీ సర్పంచి కొత్త వెంకటేశం, జక్కల మత్స్యగిరి, జక్కల నవీన్, కొత్త జంగయ్య, వార్డ్ మెంబర్లు, జక్కల పద్మ, మెడబోయిన మమత, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.