బీబీనగర్: సర్వేలో పొరపాట్లకు తావుండవద్దు
బీబీనగర్: సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదులో పొరపాట్లకు తావులేకుండా పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్లకు సర్వేపై బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై సర్వే లక్ష్యాలు, విధివిధానాలు, కార్యాచరణపై వివరించారు. జిల్లా కోడ్‌తో పాటు మండల, గ్రామ పంచాయతీ, హ్యాబిటేషన్ కోడ్ల తప్పక వేయాలని గురువారం ఎన్యుమరేట్లకు సూచించారు.